తెలంగాణకు రెయిన్ అలర్ట్...ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

By -  Knakam Karthik
Published on : 26 Feb 2026 7:05 AM IST

Telangana Rains, Rain Alert, Hyderabad Weather, Yellow Alert, Weather Update

తెలంగాణకు రెయిన్ అలర్ట్...ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వాతావరణం అస్థిరంగా ఉంటుందని, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హెచ్చరించింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలోకి తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. దీనివల్ల నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం మరియు రాత్రి వేళల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.

గరిష్ట ఉష్ణోగ్రతలు 31-33 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు 20-22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని అధికారులు సూచించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను జాగ్రత్త పరుచుకోవాలని కోరారు. రేపటి నుంచి రాష్ట్రంలో వాతావరణం క్రమంగా పొడిగా మారుతుందని, ఎండల తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Next Story