ప్రభుత్వాస్పత్రిలో మహిళా సిబ్బంది మందుపార్టీ.. బీర్లు తాగి చిందులు

Women staff beer party at Hanmakonda Government Hospital. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది బాధ్యత మరిచారు. ఏకంగా ఆస్పత్రిలోని

By అంజి  Published on  27 Oct 2022 9:15 AM GMT
ప్రభుత్వాస్పత్రిలో మహిళా సిబ్బంది మందుపార్టీ.. బీర్లు తాగి చిందులు

ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది బాధ్యత మరిచారు. ఏకంగా ఆస్పత్రిలోని ఓ గదిని బార్‌గా మార్చుకున్నారు. పైగా బయటి నుంచి స్నేహితురాలను పిలిపించుకుని మరీ పార్టీ చేసుకున్నారు. బీర్లు తాగి విందు చేసుకున్నారు. ఈ ఘటన హన్మకొండ నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగింది. వారం కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది ఈ నిర్వాకం చేశారు. బయటి నుంచి మరో ఇద్దరు మహిళలను పిలిపించుకుని ఓ రూమ్‌లో బీర్లు తాగి చిందులు వేశారు. బర్త్‌ డే వేడుకల పేరిట సాయంత్రం వేళ స్టాఫ్‌ రూమ్‌లో పార్టీ చేసుకున్నారు.

రోగులను గాలికి వదిలేసి బీరు తాగుతూ ఎంజాయ్ చేశారు. విందు చేసుకునే దృశ్యాలను.. ఆస్పత్రిలోని రోగుల బంధువులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ ఘటన గురించి ఆస్పత్రిలోని వైద్యులకు, ఇతర సిబ్బందికి తెలిసింది. వైద్య అధికారులకు ఈ విషయం తెలియడంతో.. వారు మహిళా సిబ్బందిని పిలిపించి, మందలించినట్లు సమాచారం. ఆసుపత్రిలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి పర్యవేక్షకుల డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. సిబ్బంది విందు ఏర్పాటు చేసుకున్నట్లు తమ దృష్టికి రాగానే పిలిచి హెచ్చరించామని తెలిపారు.

Next Story