కార్పొరేట‌ర్ భ‌ర్త‌ను చెప్పుతో కొట్టిన మ‌హిళ‌

Woman Slapped Nizamabad Corporator Husband.కార్పొరేట‌ర్‌ భ‌ర్తను ఓ మ‌హిళ చెప్పుతో కొట్టిన ఘ‌ట‌న నిజామాబాద్ ప‌ట్ట‌ణంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2021 8:14 AM GMT
కార్పొరేట‌ర్ భ‌ర్త‌ను చెప్పుతో కొట్టిన మ‌హిళ‌

కార్పొరేట‌ర్‌ భ‌ర్తను ఓ మ‌హిళ చెప్పుతో కొట్టిన ఘ‌ట‌న నిజామాబాద్ ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం రేపింది. పట్ట‌ణంలోని 40వ డివిజ‌న్‌కు చెందిన కార్పొరేట‌ర్ భ‌ర్త‌.. త‌మ కుమారైకు మాయ‌మాట‌లు చెప్పి తీసుకెళ్లాడ‌ని బాధిత మ‌హిళ త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. త‌మకు న్యాయం చేయాలంటూ ఈ రోజు ఉద‌యం స‌ద‌రు కార్పొరేట‌ర్ ఇంటి ముందు ఆందోళ‌నకు దిగారు.

ఈ క్ర‌మంలో బాధిత మ‌హిళ త‌ల్లిదండ్రులు, కార్పొరేట‌ర్ భ‌ర్త‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో కార్పొరేట‌ర్ భ‌ర్త‌ను.. బాధిత మ‌హిళ త‌ల్లి చెప్పుతో కొట్టింది. త‌మ కుమారైను త‌మ‌కు అప్ప‌గించాల‌ని అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డి నుంచి క‌దిలేది లేద‌ని కార్పొరేట‌ర్ ఇంటి ముందు బాధిత మ‌హిళ త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు దిగారు.

Next Story
Share it