హైదరాబాద్‌లో రేపు వైన్ షాపులు బంద్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 2 Dec 2023 12:50 PM ISTహైదరాబాద్‌లో రేపు వైన్ షాపులు బంద్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు రాష్ట్రంలో దిగాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండనుంది. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తులో పాల్గొననున్నారు. కాగా.. పోలింగ్ తర్వాత విడుదలై ఎగ్జిట్‌పోల్స్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిని రేపుతున్నాయి. కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా రిజల్ట్స్ ఉంటాయి దాదాపుగా పోల్స్ చెప్పడం ఎగ్జైట్‌మెంట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్‌షాపులను బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. నగరంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వైన్ షాపు యజనమానులకు పోలీసులు సమచారాన్ని అందిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి వైన్ షాపులను ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా.. వైన్ షాపులు రేపు క్లోజ్ అయ్యే ఉంటాయని తెలియడంతో మందుబాబులు కంగారుపడుతున్నారు. ఇవాళే కొనుక్కుని పెట్టుకోవాలని వైన్ షాపులకు పరుగులు తీస్తున్నారు.
కాగా.. తెలంగాణలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీజీపీ అంజనీకుమార్ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలపై భద్రత పెంచాలనీ.. అభ్యర్థులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.