భార్య ఆత్మహత్య.. స్పృహా కొల్పోయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. ఆస్పత్రిలో చేరిక
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 21 Jun 2024 11:21 AM ISTభార్య ఆత్మహత్య.. స్పృహా కొల్పోయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. ఆస్పత్రిలో చేరిక
హైదరాబాద్: నిన్న అర్ధరాత్రి సమయం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సత్యం, రూపాదేవి దంపతులు. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. రూపా దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో రూపా దేవి ఆత్మహత్య చేసుకుంది. రూపా దేవి మృతిపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు.. రూపా దేవి కుటుంబ సభ్యుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే భార్య కొంతకాలంగా కడుపు నొప్పి సమస్యలతో బాధపడుతోందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. కడుపునొప్పి భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
అయితే రూపా దేవి ఆత్మహత్యకు ముందు తన భర్త ఎమ్మెత్యే సత్యంకు వీడియో కాల్ చేసింది. నిన్న అల్వాల్ నుండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండికి వెళ్ళి తిరిగి సాయంత్రం సమయంలో వస్తుండగా ఆయనకు తన భార్య వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పింది. మేడిపల్లి సత్యం ఇంటికి చేరుకునేలోపే ఆమె ఆత్మహత్య చేసుకుని.. విగత జీవిగా పడి ఉంది. ఆమెను చూసిన భర్త మేడిపల్లి సత్యం స్పృహ తప్పి పడిపోయాడు. అయితే రూప దేవి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లోనే ఆమె తల్లి, కొడుకు, కూతురు ఉన్నారు. అయినా కూడా వీరెవరికీ తెలియకుండా రూపాదేవి ఆత్మ హత్య చేసుకుంది. అయితే ఇంట్లో ఉన్న వీరెవరు ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా ఆపలేదా? అని పోలీసులకు అనుమానం వచ్చింది.
ఇదిలా ఉండగా మరోవైపు భార్య మృతి చెందిన విషయం తెలియడంతో మేడిపల్లి సత్యం రక్తపోటు తగ్గి స్పృహ తప్పి పడిపోవడంతో అతన్ని వెంటనే అల్వాల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. పొన్నం ప్రభాకర్ ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ మార్చురీ వద్దకు చేరుకొని పోస్టుమార్టం ప్రక్రియ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తిరుమలగిరిలోని డైరీ ఫామ్ సమీపంలో ఉన్న స్మశాన వాటికలో రూపాదేవి అంతక్రియలు జరగనున్నట్లు సమాచారం.