ఓటర్ స్లిప్ అందలేదా..? అయితే మీరిలా చేయండి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 11:32 AM GMTఓటర్ స్లిప్ అందలేదా..? అయితే మీరిలా చేయండి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. అయితే.. ఓటింగ్ సమయం దగ్గరపడుతున్న సమయంలో కొందరిలో అనుమానాలు ఉంటాయి. ఇంకా ఓటర్ స్లిప్ అందలేదని... ఎక్కడ ఓటు వేయలేదని అనుకుంటూ ఉంటారు.
ఎన్నికల ముందు ఓటర్లకు స్లిప్‌లు పంపణీ చేయడం బీఎల్‌వోల పని. కానీ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో చాలా చోట్ల పూర్తిస్థాయిలో ఓటర్ స్లిప్‌ల పంపిణీ పూర్తి కాలేదు. దాంతో.. తమకు ఓటు వేసేందుకు అవకాశం లేదా అని కొందరు అనుమానపడుతున్నారు. అయోమయానికి గురవుతున్నారు. ఏ ఓటింగ్ కేంద్రానికి వెళ్లాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఇబ్బందులు ఇక ఎవరూ పడకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈజీగానే ఇంట్లో ఉండే ఓటింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
మీ చేతిలో ఫోన్ ఉంటే.. ఒకే ఒక్క మెసేజ్‌తో మీ పోలింగ్ బూత్ వివరాలను తెలుసుకోవచ్చు. ఓటర్ గుర్తింపు కారు ఉంటే దాని నెంబర్ టైప్ చేసి 1950 లేదంటే 92117 28082 నెంబర్లకు ఎస్‌ఎంఎస్ పెడితే.. మీరు ఓటు వేయాల్సిన బూత్ వివరాలు క్షణాల్లోనే వచ్చేస్తాయి. మరోలా కూడా మీ పోలింగ్ బూత్ డిటెయిల్స్‌ను తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం వద్ద 24 గంటలు పనిచేసే టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుంది. 1950కి కాల్ చేసి పోలింగ్ కేంద్రం.. బూత్, నెంబర్, తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక టెన్షన్ అవసరం లేదు.. ఓటర్ స్లిప్ రాపోయినా.. పోలింగ్ బూత్ ఎక్కడో తెలుసుకోవాలన్నా ఇలా చేస్తే సరిపోతుంది.