త్వరలోనే కవిత అరెస్టు : వివేక్ వెంకటస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Vivek Venkataswamy Comments On Delhi Liquor Scam. లిక్కర్ స్కాంలో అతిత్వరలోనే కవిత జైలుకి వెళ్తుందని బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

By Medi Samrat  Published on  27 Feb 2023 3:00 PM IST
త్వరలోనే కవిత అరెస్టు : వివేక్ వెంకటస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

లిక్కర్ స్కాంలో అతిత్వరలోనే కవిత జైలుకి వెళ్తుందని బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ పై వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న అవినీతి సొమ్మునంతా ఇతర రాష్ట్రాల్లో‌ ఖర్చు పెడుతున్నారని.. దేశంలో అన్ని పార్టీల‌ కన్నా రిచ్‌ పార్టీ, ఎక్కువ నిధులు ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని అన్నారు. ప్రజల సొమ్ముతో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ అంటూ నాలుగు వందల‌ కోట్లతో విమానం కొన్నారని, తెలంగాణ ఖజానాను దోచుకునేందుకు కేసిఆర్ జీవిస్తున్నార‌ని ఆరోపించారు. రైతులకు, ప్రజలకు ఇచ్చి‌న హామీలను కేసీఆర్ మరిచారని, మెగా కృష్ణారెడ్డి వంటి కాంట్రాక్టర్ లను ప్రపంచ ధనికుడిని చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారందరికి తెలంగాణలో స్ధానం లేదని.. పంజాబ్, గుజరాత్ ఎన్నికలలో నగదు అవసరం అని, కేజ్రీవాల్ తో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్న కవిత.. 150 కోట్ల రూపాయలు ఆఫ్ గవర్నమెంట్ కు ఇచ్చిందన్నారు.. త్వరలోనే సిసోడియా ఎలాగైతే జైలుకు వెళ్ళాడో, అతిత్వరలోనే కవిత కూడా జైలుకు వెళ్తుందన్నారు. లిక్కిర్ స్కాంను ఢిల్లీ, పంజాబ్ లో కూడా చేయాలనే కాకుండా దేశం అంతా చేయాలని అనుకున్నారని, కేంద్రం ఈ లిక్కర్ స్కాంలో ఎక్కువ మందిని అరెస్టు చేసే పరిస్ధితులు ఉందన్నారు.


Next Story