Telangana: లోక్‌సభ ఎన్నికలకు 35,808 పోలింగ్ కేంద్రాలు: వికాస్‌రాజ్
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 1 May 2024 2:00 PM ISTTelangana: లోక్‌సభ ఎన్నికలకు 35,808 పోలింగ్ కేంద్రాలు: వికాస్‌రాజ్
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో పలు దఫాల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి హైదరాబాద్‌లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఇక ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 285 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపీ ఎన్నికల్లో పోటీలో ఉన్నట్లు వికాస్‌రాజ్ చెప్పారు. ఇక రాష్ట్రంలో ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడుతున్నట్లు వికాస్‌రాజ్ చెప్పారు. మే 3వ తేదీ నుంచి హోం ఓటింగ్ ప్రారంభం కానుందనీ.. అలాగే హైదరాబాద్‌లో మొత్తం 3986 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వికాస్ రాజ్ ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆయన చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తి కానుందని ఆయన చెప్పారు. అయితే.. రాజకీయ పార్టీల నుంచి తమకు వినతులు అందాయనీ.. ఎండాకాలం సందర్భంగా పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచాలని కోరినట్లు చెప్పారు. రాజకీయ పార్టీల వినతులను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు.