వికారాబాద్: విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

By Srikanth Gundamalla
Published on : 28 Oct 2023 9:45 PM IST

Vikarabad, Two died,   electric shock,

 వికారాబాద్: విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దాంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలోని దేవర్ పస్లాబాద్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంద. నట్ట వెంకటప్ప (54) అనే వ్యక్తి తన పొలంలోకి ఎటువంటి జంతువులు వెళ్లకుండా చుట్టూ కరెంటు వైర్లు పెట్టాడు. అయితే.. రాత్రి పెట్టిన కరెంటు వైర్లను తొలగించేందుకు ఉదయాన్ని పొలానికి వెళ్లాడు వెంకటప్ప. మళ్ళీ వాటిని తీసే క్రమంలో అతనికి ఒక్కసారిగా కరెంటు షాక్ తగిలింది. అతడు విద్యుత్‌ షాక్‌తో కొట్టుకుంటూ ఉండటాన్ని అక్కడే ఉన్న ఎల్జీ తాండాకు చెందిన చందర్ నాయక్ (49) అనే వ్యక్తి గమనించాడు. దాంతో.. వెంకటప్పను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి కూడా విద్యుత్ షాక్ తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం స్వయంగా ఎస్సై రమేష్ కుమార్ వెల్లడించారు. ఈ విషాద సంఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నా మని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఇద్దరు మృతి చెందడంతో ఆ గ్రామంలో చీకట్లు కమ్ముకున్నాయి.


Next Story