అందుకే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ అమలు చేయట్లేదా.?
Vijayashanti Fires On CM KCR. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే.. కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుందని విజయశాంతి అన్నారు.
By Medi Samrat Published on
18 May 2021 9:43 AM GMT

రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదని.. ఫీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే.. గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడంలేదని నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే.. కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుందని.. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందని ఆమె అన్నారు.
సీఎం కేసీఆర్ తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా.. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్‌తో రేపు జరగబోతున్న "గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష"ను విజయవంతం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు.
Next Story