తనదైన చేష్టలతో హావాభావాలతో, యాసలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ వివాదంలో ఇరుకున్నారు. బిత్తిరి సత్తి భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడని రాష్ట్రీయ వానరసేన బుధవారం హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఆయన స్పందించారు.
తాను సరదాగా చేసిన వీడియో అది అని తెలిపారు. కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరీని కించపరచాలన్న ఉద్దేశ్యం తనది కాదని వివరించారు. చిన్న అక్షరదోషం వలన అలా జరిగిందన్నారు. ఎవరైనా బాధపడితే తాను క్షమాపణలు చెబుతున్నానంటూ చెప్పుకొచ్చారు. తాను కూడా భగవద్గీతను చదువుతానని వెల్లడించారు.
బిత్తిరి సత్తి.. అలియాస్ ఇస్మార్ట్ సత్తి భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్కిట్ చేశాడు. దీని హిందూ సంఘాలు సైతం బిత్తిరి సత్తిపై మండి పడుతున్నాయి. వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ సర్వత్రా బిత్తిరి సత్తిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకి వానర సేన అనే హిందూ సంఘం ఫిర్యాదు పిర్యాదు చేసింది.