కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తన ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంజాగుట్టలో 2019 ఏప్రిల్ 12 న అంబేద్కర్ విగ్రహం పెట్టానని.. ఏప్రిల్ 13న అంబేద్కర్ విగ్రహం కూల్చారని ఫైర్ అయ్యారు. అమలాపురం వెళ్లి రూ.5 లక్షలు పెట్టి విగ్రహం తెప్పించానని.. అంబేద్కర్ బొమ్మను పోలీస్ స్టేషన్ లో పెడతారా అంటూ ప్రశ్నించారు.
అంబేద్కర్ విగ్రహం ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని.. అంబేద్కర్ కోసం నేను చావడానికి సిద్ధంమని అన్నారు. విగ్రహం విషయంలో ప్రభుత్వం లో ఉన్న ఏ ఒక్కరు మాట్లాడటం లేదని.. రాజ్యాంగ అధినేతకు తెలంగాణలో దిక్కు లేదు అసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లోని ఎస్సీ , బీసీ నాయకులు ఒక్కరూ మాట్లాడటం లేదని వారిపై మండిపడ్డారు. ఇదిలివుంటే.. షర్మిల నతన పార్టీపై స్పందిస్తూ.. ఆమె రాజన్న రాజ్యం అంటుంది. ఆయన రాజ్యం ఎక్కడిది.. అది కాంగ్రెస్ రాజ్యమని ఫైర్ అయ్యారు.