వెయిటింగ్ ఎందుకు దండ‌గ‌..టీఎస్ ఆర్టీసీ ఉండ‌గా : స‌జ్జ‌నార్‌

VC Sajjanar respond on heavy traffic jam at toll plazas.టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2023 5:18 AM GMT
వెయిటింగ్ ఎందుకు దండ‌గ‌..టీఎస్ ఆర్టీసీ ఉండ‌గా : స‌జ్జ‌నార్‌

తెలుగు ప్ర‌జ‌లు జ‌రుపుకునే పండుగల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి. పండుగ‌కు ఒక రోజు ముందు నుంచే సెలవులు ప్ర‌క‌టించ‌డంతో హైద‌రాబాద్‌లో నివ‌సించే ప్ర‌జ‌లు త‌మ స్వ‌గ్రామాలకు వెలుతున్నారు. ఎవ‌రికి ఏ విధంగా వీలు ఉంటే ఆ విధంగా స్వ‌గ్రామాల‌కు బ‌య‌లుదేరారు. ఒకేసారి వేల సంఖ్య‌లో వాహ‌నాలు రావ‌డంతో హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారి నెంబ‌ర్ 65 పై వాహ‌న ర‌ద్దీ భారీగా పెరిగింది. దీంతో పంతంగి వ‌ద్ద ఉన్న టోల్ ప్లాజా వ‌ద్ద వాహ‌నాలు దాదాపు కిలోమీట‌ర్ మేర నిలిచిపోయాయి.

ఫాస్టాగ్ విధానం అమ‌ల్లో ఉన్నా.. వాహ‌నాలు అధిక సంఖ్య‌లో రావ‌డం, కొన్ని వాహ‌నాల ఫాస్టాగ్‌లు స్కాన్ కాక‌పోవ‌డంతో కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోతున్నాయని టోల్ ప్లాజా నిర్వాహ‌కులు చెబుతున్నారు.

వెయిటింగ్ ఎందుకు దండ‌గ‌..టీఎస్ ఆర్టీసీ ఉండ‌గా

పంతంగి వ‌ద్ద మాత్ర‌మే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ టోల్ ప్లాజాల వ‌ద్ద ఇదే ప‌రిస్థితి ఉంది. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ స్పందించారు. "సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లి టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. #TSRTC బస్సుల్లో ప్రయాణించి టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. మా సిబ్బంది మిమ్ముల్ని క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు. "అని ట్వీట్ చేశారు.

Next Story