వనభోజనం: రాయితీ ధరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

'Vanabhojanam'..TSRTC offers special bus services at discounted price. హైదరాబాద్: కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ' వనభోజనం ' ప్లాన్ చేసుకునే వారి కోసం ప్రత్యేక తగ్గింపు

By అంజి
Published on : 28 Oct 2022 10:22 AM IST

వనభోజనం: రాయితీ ధరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

హైదరాబాద్: కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ' వనభోజనం ' ప్లాన్ చేసుకునే వారి కోసం ప్రత్యేక తగ్గింపు ధరలతో టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందిస్తోంది. సభ్యుల సంఖ్యను బట్టి, మినీ-బస్సు లేదా సాధారణ బస్సులను బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు 40 మందితో కూడిన మినీ వజ్ర బస్సును, పెద్ద బృందానికి ఆర్డినరీ బస్సును అద్దెకు తీసుకోవచ్చని కార్పొరేషన్ తెలిపింది. అవసరం లేకున్నా.. రోజంతా చార్జీలు వసూలు చేయకుండా గంట చొప్పున బస్సులను అద్దెకు తీసుకుంటున్నారు.

రెండు నెలలు, ఒక నెల ముందు బస్సులను బుక్ చేసుకునే వారు వరుసగా 20 శాతం, 15 శాతం తగ్గింపును పొందవచ్చు. ప్రజలు మరింత సమాచారం మరియు బుకింగ్‌ల కోసం 040-69440000 లేదా 040-23450033లో సంప్రదించవచ్చు. మరోవైపు కార్తీక మాసం నేపథ్యంలో వివిధ పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.


Next Story