నాకు రెండు సార్లు సీఎంగా అవకాశం వచ్చినా తీసుకోలేదు : వీహెచ్‌

నాకు ఓబీసీ కన్వీనర్‌గా అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరుగుతాన‌ని.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా నేను అక్కడి వెళ్లి న్యాయం కోసం పోరాడుతాన‌ని మాజీ ఎంపీ వి. హనుమంత రావు అన్నారు

By Medi Samrat  Published on  14 Aug 2024 2:42 PM IST
నాకు రెండు సార్లు సీఎంగా అవకాశం వచ్చినా తీసుకోలేదు : వీహెచ్‌

నాకు ఓబీసీ కన్వీనర్‌గా అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరుగుతాన‌ని.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా నేను అక్కడి వెళ్లి న్యాయం కోసం పోరాడుతాన‌ని మాజీ ఎంపీ వి. హనుమంత రావు అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నాకు రెండు సార్లు సీఎం అవకాశం వచ్చినా నేను తీసుకోలేదు.. నాకు పదవులు ముఖ్యం కాదు.. పార్టీ కోసం పని చేస్తాన‌ని తెలిపారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలనేదే నా ఏకైక లక్ష్యం అన్నారు.

నిన్న ఏఐసీసీ మీటింగ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లి కార్జున ఖర్గేలు కులగణన చేయాలని చెప్పారు. కులగణన జరిగితే సామాజిక న్యాయం జరుగుతదని రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. 1931లో కులగణన జరిగింది, మళ్ళీ ఇప్పటివరకు జరగలేదు. బీజేపీ పార్టీ తప్పు.. అన్నీ రాజకీయ పార్టీలు కూడా కులగణన చేయాలంటున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన బిల్లు పెట్టారని.. కులగణన కోసం 150 కోట్లు బడ్జెట్ ను కూడా కేటాయించారని తెలిపారు. ఓబీసీ ఎంపీల కన్వీనర్ గా కోట్లాడి ఐఐటీ, ఐఐఎం లలో రిజర్వేషన్ ను తీసుకొచ్చాను.. ఇప్పుడు ఎంతో మంది కి ఉద్యోగాలు వచ్చాయన్నారు.

Next Story