సికింద్రాబాద్‌ టూ గోవా: కొత్త రైలు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : నగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

By అంజి  Published on  6 Oct 2024 2:13 PM GMT
Union Minister Kishan Reddy, new train, Secunderabad, Goa

సికింద్రాబాద్‌ టూ గోవా: కొత్త రైలు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : నగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. రెగ్యులర్‌ సర్వీసులు సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 9న, వాస్కోడగామా నుంచి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌-వాస్కోడగామా (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో వాస్కోడగామా-సికింద్రాబాద్‌ (17040) రైలు ప్రతి గురు, శనివారాల్లో బయల్దేరుతాయి.

ప్రస్తుతం సికింద్రాబాద్‌-వాస్కోడగామా మధ్య రెగ్యులర్‌ సర్వీసు (17603) ఉంది. అది మంగళ, బుధ, శుక్ర, ఆది వారాల్లో నడుస్తోంది. ప్రయాణికుల నుంచి తీవ్ర డిమాండ్‌ ఉండటంతో ఈ రైలు ఎప్పుడూ కిటకిటలాడుతుంది. హైదరాబాద్‌ నుంచి వాస్కోడగామాకు మరో రైలు (17021) ఉంది. కానీ వారంలో ఒక రోజు మాత్రమే నడుస్తుంది. ఇందులోనూ టికెట్లు దొరకడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో కొత్త రైలు పర్యాటకుల ప్రయాణ అవకాశాల్ని పెంచనుంది. అదనంగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Next Story