కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం..

Union minister Kishan reddy elder brother passed away.బీజేపీ నేత‌ జి.కిషన్‌రెడ్డి ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న పెద్ద సోదరుడు యాదగిరిరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 3:22 AM GMT
Kishan reddy

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, తెలంగాణ బీజేపీ నేత‌ జి.కిషన్‌రెడ్డి ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న పెద్ద సోదరుడు యాదగిరిరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 85 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండ‌లం తిమ్మాపూర్‌లోని త‌న నివాసంలో బుధ‌వారం రాత్రి క‌న్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్‌రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. యాదగిరిరెడ్డి మృతి విషయం తెలిసిన పలువురు నేతలు కిషన్‌రెడ్డిని పరామర్శించారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Next Story
Share it