విద్యుత్‌ మీటర్‌కు ఫోన్‌ నెంబర్ లింక్‌ చేశారా? లేదా?

తెలంగాణ విద్యుత్‌ శాఖ అధికారులు కొద్ది రోజులుగా ఒక సూచన చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  3 Feb 2024 5:10 AM GMT
TSSPDCL, mobile number link,  telangana,

 విద్యుత్‌ మీటర్‌కు ఫోన్‌ నెంబర్ లింక్‌ చేశారా? లేదా? 

తెలంగాణ విద్యుత్‌ శాఖ అధికారులు కొద్ది రోజులుగా ఒక సూచన చేస్తున్నారు. అధికారులే కాదు.. దీనికి సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో కూడా చక్కర్లు కొడుతూనే ఉంది. అదే విద్యుత్‌ మీటర్‌కు సెల్‌ఫోన్‌ నెంబర్‌ను లింక్‌ చేసుకున్నారా? లేదా? విద్యుత్‌ వినియోగదారులకు ఇది ముఖ్యమైన అలర్ట్‌ అని విద్యుత్‌ శాఖ అధికారులు అంటున్నారు. విద్యుత్ మీటర్‌కు మొబైల్‌ నెంబర్‌ లింక్ చేసుకోవాలని.. దీని వల్ల పలు బెనిఫిట్స్‌ కూడా ఉంటాయని చెబుతున్నారు. ఎందుకులే అని వదిలేస్తే మాత్రం కొంత ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

తెలంగాణలో ఉన్న విద్యుత్‌ వినియోగదారులంతా తమతమ మొబైల్ నెంబర్లను విద్యుత్‌ మీటర్లతో కనెక్ట్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కరెంటు మీటర్‌కు మొబైల్‌ నెంబర్‌ లింక్ ఉండటం ద్వారా అన్ని రకాల సమాచారాలు ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తాయి. కరెంటు బిల్లు ఎంత వచ్చిందేని తెలుసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కరెంటు ఉంటుందనేది.. ఏ సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందనే వివరాలు నేరుగా వినియోగదారులు తెలుసుకోవచ్చు.

ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) అధికారులు విద్యుత్‌ వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. ఇందుకోసం ssouthernpower.com వెబ్‌సైట్‌ను సందర్శించి ఫోన్‌ నెంబర్‌ను లింక్ చేసుకోవాలని సూచించారు. కొందరు వినియోగదారులు తమ ఫోన్‌ నెంబర్లు మారినా కూడా వాటిని అప్‌డేట్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. విద్యుత్‌ మీటర్‌ రీడర్‌ తీసుకునే వ్యక్తి వచ్చినప్పుడు కూడా ఫోన్ నెంబర్ వారికి ఇవ్వడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందొచ్చని చెబుతున్నారు.

కాగా.. హైదరాబాద్‌లో ఇటీవల చెట్ల తొలగింపుతో పాటు, మెయింటెనెన్స్‌ కారణాలతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దాంతో ఎప్పుడు కరెంటు తిరిగి వస్తుందో తెలియక ప్రజలు తికమక పడుతున్నాడు. కొన్నిసార్లు చాలా సమయం దాటితే కానీ విద్యుత్ తిరిగి రావడం లేదు. ఈ క్రమంలో విద్యుత్‌ కోతలపై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సిబ్బందికి ఫిర్యాదులూ అందుతున్నాయి. అంఉదకే మొబైల్‌ నెంబర్‌ను లింక్‌ చేసుకుని విద్యుత్‌ కోతలు సహా ఇతర విషయాలను తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

Next Story