తెరపైకి మళ్లీ అశ్వధ్దామ రెడ్డి.. ఈసారి ఎందుకంటే?

TSRTC Union Leader Ashwathama Reddy. 2019 నుంచి 2021వరకు రావాల్సిన నాలుగు విడతల డీఏను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు.

By Medi Samrat  Published on  5 March 2021 11:59 AM GMT
TSRTC Union Leader Ashwathama Reddy
అప్పట్లో తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మే సందర్భంగా అధికార పార్టీకి కార్మిక సంఘాల మద్య పెద్ద ఎత్తున యుద్దమే సాగింది. ఆర్టీసీ కార్మికుల కోరికలు తీర్చాలని వివిధ పార్టీలు మద్దతు పలికాయి. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మే సందర్భంగా ఎక్కువగా వినిపించిన పేరు అశ్వద్దామరెడ్డి. ఒక దశలో ఆయన కేసీఆర్ మాటలను లెక్క చేయకుండా సంప్రదింపులను కూడా దిక్కరించారు. 47 వేల మంది కార్మికులను ఏకతాటిపై నడుపారు. అయితే ఒకప్పుడు అశ్వధ్దామరెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పెంచిన నాయ‌కుడే. గతంలో ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉండేది.


ఇప్పటికీ ఉంది. కానీ దాని నాయకత్వం ఏపీకి చెందినవారు ఉండేవారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణకు కూడా సొంత యూనియన్ ఉండాలన్న ఉద్దేశ్యంతో అశ్వత్థామ రెడ్డి తెలంగాణ మజ్దూర్ యూనియన్ అంటూ సొంత కుంపటి పెట్టాడు.

తెలంగాణ జోరులో అది సక్సస్ అయ్యింది. ఆర్టీసీ సమ్మే సమయంలో కేసీఆర్ వర్సెస్ అశ్వద్ధామ కు ఘోరంగా చెడింది. చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి అశ్వద్ధామ ఎంట్రీ ఇచ్చారు. 2019 నుంచి 2021వరకు రావాల్సిన నాలుగు విడతల డీఏను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు.ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పాలిట శాపంగా మారిన ఉద్యోగ భద్రత సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని అశ్వత్థామ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీసీఎస్కు చెల్లించాల్సిన సుమారు రూ.850 కోట్ల బకాయిలు చెల్లించాలని అశ్వత్థామ డిమాండ్ చేశారు. యూనియన్లను రద్దు చేసి సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేస్తామని చేసిన ప్రభుత్వ ప్రకటన నేటికీ అమలుకు నోచుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరాహార దీక్షలో యూనియన్ నాయకులు తిరుపతి, శంకర్, సోమయ్య, నిరంజన్, వీకే రెడ్డి, మహిళా నాయకులు, శారద, పద్మలత, శ్రీదేవి, కౌసల్య పాల్గొన్నారు




Next Story