ఆర్టీసీ కోసం 'ఆర్ఆర్‌ఆర్'ని ఇలా.. ఫిదా కావాల్సిందే

TSRTC MD Sajjanar uses RRR song for RTC Promotions.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ఆర్టీసీ) ఎండీగా వీసీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2022 4:00 AM GMT
ఆర్టీసీ కోసం ఆర్ఆర్‌ఆర్ని ఇలా.. ఫిదా కావాల్సిందే

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ఆర్టీసీ) ఎండీగా వీసీ స‌జ్జ‌నార్‌ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి సంస్థ‌ను గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. న‌ష్టాల నుంచి సంస్థ‌ను లాభాల బాట ప‌ట్టించేందుకు, ఎక్కువ మంది సామాన్య ప్ర‌జ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణీంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. స‌మ‌స్య ఏదైనా స‌రే ఒక్క ట్వీట్‌తో ప‌రిష్కారం చూపుతున్నారు. అందివ‌చ్చే ఏ అవ‌కాశాన్ని కూడా వ‌ద‌ల‌డం లేదు. కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు, స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌ల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపారు.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స‌జ్జ‌నార్‌.. 'ఆర్ఆర్ఆర్' సినిమా టైటిల్ అర్థాన్నే మార్చేసి.. ఆర్టీసికి నెక్ట్స్ లెవల్ పబ్లిసిటీ ఇచ్చేశారు. 'ఆర్ఆర్ఆర్' అంటే 'రౌద్రం ర‌ణం రుధిరం' అని జ‌క్క‌న చెబితే.. స‌జ్జ‌నార్ మాత్రం 'రాష్ట్ర.. రోడ్డు.. ర‌వాణా' గా మార్చేశారు. అంతేనా.. 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి ఇటీవ‌ల విడుద‌లైన 'నెత్తురు మ‌రిగితే ఎత్త‌ర జెండా' సాంగ్‌ని ఆర్టీసీ ప్ర‌చారానికి వాడేశారు. ఆ పాట‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ జెండా పట్టుకుని 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా' పాట పాడుతారు. ఈ పాటలో జెండాపై 'వందేమాతరం' అని ఉంటుంది. కానీ సజ్జనార్ చేసిన ట్వీట్‌లో ఆ 'వందేమాతరం' స్థానంలో టీఎస్ఆర్టీసీ లోగో, బస్సు గుర్తులు ఉన్నాయి. ప్ర‌స్తుతం స‌జ్జ‌నార్ చేసిన ట్వీట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మొత్తంగా స‌జ్జ‌నార్‌, టీఎస్ఆర్టీసీ క్రియేటివిటీకి ఫిదా అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it