టీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బిడ్డలతో బస్టాండ్‌కు వచ్చే తల్లుల కోసం బేబీ ట్రాలీలు

TSRTC has also set up baby trolleys for mothers coming to the busstand with suckling babies. సైబరాబాద్‌ సీపీగా ఎన్నో దారుణమైన క్రైమ్‌ కేసులను చేధించి, నేరాలను అరికట్టడానికి ఎంతో కృషి చేశారు వీసీ

By అంజి  Published on  11 March 2022 3:40 AM GMT
టీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బిడ్డలతో బస్టాండ్‌కు వచ్చే తల్లుల కోసం బేబీ ట్రాలీలు

సైబరాబాద్‌ సీపీగా ఎన్నో దారుణమైన క్రైమ్‌ కేసులను చేధించి, నేరాలను అరికట్టడానికి ఎంతో కృషి చేశారు వీసీ సజ్జనార్‌. ఆ తర్వాత సజ్జనార్‌ను ప్రభుత్వం రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా నియమించింది. కాగా సజ్జనార్‌ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కూడా సరికొత్త ఆలోచనలతో ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసీని ప్రజలకు దగ్గరికి మరింత చేరువ చేస్తున్నారు. అనూహ్యమైన మార్పులతో ప్రయాణికులను తనవైపు తిప్పుకుంటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే ఎన్నో కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు అందుకుంటున్నారు. చంటి బిడ్డలతో బస్సు ప్రయాణం చేసే తల్లుల కోసం.. బస్టాండ్ల దగ్గర బేబీ ట్రాలీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

బస్సు ఎక్కేందుకు బస్టాండ్‌కు వచ్చే తల్లులు తమ చంటి బిడ్డలను అందులో కూర్చోబెట్టుకుని బస్సు దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వీటిని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే అన్ని బస్టాండ్లలో కూడా బేబీ ట్రాలీలను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. కాగా సజ్జనార్‌ నిర్ణయంపై చంటి బిడ్డల తల్లులు ఎంతోగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమ పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా బస్టాండ్‌లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంపై ఎంతో మంది తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.Next Story
Share it