పెళ్లిళ్ల సీజన్‌.. అద్దె బస్సులపై టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ

TSRTC announces special discount on renting buses in wedding season. హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఎప్పటికప్పుడు

By అంజి  Published on  9 Feb 2023 3:46 PM IST
పెళ్లిళ్ల సీజన్‌.. అద్దె బస్సులపై టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ

హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఎప్పటికప్పుడు అధికారులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక తగ్గింపును అందజేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తామని ఆర్టీసీ తెలిపింది.

దీని గురించి తెలుపుతూ టీఎస్‌ఆర్టీసీ ట్వీట్ చేసింది. టీఎస్‌ఆర్టీసీ పెళ్లిళ్ల సీజన్ సందర్భంలో కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు అద్దెపై ప్రత్యేక తగ్గింపును అందజేస్తున్నారు. అన్ని రకాల బస్సు సర్వీసులపై 10 శాతం తగ్గింపు ఉంటుంది. అద్దె బస్సులపై ఈ ఏడాది జూన్ 30 వరకు 10 శాతం తగ్గింపు అమలులో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం, ప్రయాణీకులు 040- 69440000 లేదా 040- 23450033 నంబర్‌లను సంప్రదించవచ్చు. టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్‌లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.


Next Story