TSPSC చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం 600 దరఖాస్తులు
టీఎస్ పీఎస్‌సీ చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 1:30 PM ISTTSPSC చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం 600 దరఖాస్తులు
టీఎస్ పీఎస్‌సీ చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు భారీ ఎత్తున దరఖాస్తులు నమోదు అయ్యాయి. ఏకంగా 600కు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. ఆశావాహులు చైర్మన్‌తో పాటు మెంబర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. రిటైర్డ్ ఏఎస్, ఐపీఎస్‌లతో పాటు సర్వీస్‌లో ఉన్నవారు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. కాగా.. స్క్రూటీని తర్వాత ఫైనల్ లిస్ట్‌ను అధికారులు ప్రభుత్వానికి అందజేస్తారు.
అయితే.. టీఎస్‌పీఎస్‌సీలో పోస్టు భర్తీకి జనవరి 18వ తేదీతో గడువు ముగిసింది. చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. శనివారం, లేదా ఆదివారం వరకు ఫైనల్ రిపోర్టును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ ప్రమేయం లేకుండా సభ్యులను, చైర్మన్‌ను నియమించాలని రాష్ట్ర ప్రబుత్వం యోచిస్తోంది. కాగా.. ఈనెల 12న టీఎస్‌పీఎస్‌సీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విసం తెలిసిందే.
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే యూపీఎస్‌సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మార్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనమా చేశారు. వారి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో టీఎస్‌పీఎస్‌సీలో ఖాళీలు ఏర్పడ్డాయి.