తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. గవర్నర్ కోటాలో ముగ్గురిని కేసీఆర్ ఎంపిక చేశారు. బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, దయానంద్ గుప్తాలు ఎమ్మెల్సీ పదవులకు ఎంపికయ్యారు. త్వరలో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో ఈ ముగ్గురిని ఎంపిక చేశారు కేసీఆర్.
అయితే ఎమ్మెల్సీ మూడు స్థానాలు కూడా అధికార టీఆర్‌ఎస్ కే దక్కే అవకాశాలు ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారైనట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా సమాచారం.ఈ ముగ్గురి పేర్లను పరిశీలించిన సీఎం కేసీఆర్.. అనంతరం వీరిని ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక చేశారు. ఈ ముగ్గురు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా, దివంగత నాయిని నర్సింహారెడ్డి రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ల పదవి కాలం ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నుంచి శాసన మండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి.