తెలంగాణలో తెరుచుకోనున్న పాఠశాలలు
TS Schools Reopen .. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పాఠశాలలు తెరుచుకునే అవకావం కనిపిస్తోంది. రెండు, మూడు వారాల్లో
By సుభాష్ Published on 6 Dec 2020 7:06 AM ISTతెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పాఠశాలలు తెరుచుకునే అవకావం కనిపిస్తోంది. రెండు, మూడు వారాల్లో రెగ్యులర్‌గా తరగతులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందకు సంబంధించిన ప్రతిపానలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం అనుమతి వస్తే తరగతులను రెగ్యులర్‌గా ప్రారంభించనున్నారు. స్థానిక సంస్థల సహకారంతో స్కూళ్లు, తరగతి గదులను శానిటైజ్ చేయిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైతే తర్వాత విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా బెంచీలకు మధ్య దూరం పెంచి తరగతులు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఒక తరగతి గదిలో 20 మంది ఉండేలా చూస్తున్నారు. అలాగే భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇక విద్యార్థులకు ఇమ్యూనిటీ పెంచేందుకు మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందించనున్నారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతం చేస్తున్న కరోనా మహహ్మారి రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుఖం పడుతున్నాయి. గతంలో రెండు వేలకు వరకు కేసు నమోదు అవుతుండగా, ప్రస్తుతం 500 వరకు కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నారు. దీంతో దాదాపు 8 నెలలుగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడు తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 596 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,72,719 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,470 మంది మృతి చెందారు. తాజాగా 921 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,62,751 కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,498 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 6,465 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 102 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.