తెలంగాణ‌లో కాస్త త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

TS reports new covid 19 cases today.తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 76,047 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా 5,892 పాజిటివ్ కేసులు న‌మోదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2021 4:28 AM GMT
TS corona update

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 76,047 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా 5,892 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640కి చేరింది. నిన్న ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 2,625కి చేరింది. నిన్న 9,122 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,05,164కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 73,851 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 84.12శాతంగా ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 0.54శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,104, రంగారెడ్డి జిల్లాలో 443, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 378, వరంగల్‌ అర్బన్‌లో 321, నల్గొండలో 323, కరీంనగర్‌లో 263, నాగర్‌ కర్నూల్‌లో 204, సిద్దిపేటలో 201 కేసులు న‌మోదు అయ్యాయి.




Next Story