టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాల విడుద‌ల‌

TS Polycet 2021 results Releasd.టీఎస్ పాలిసెట్ -2021 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ స్టేట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2021 6:49 AM GMT
టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాల విడుద‌ల‌

టీఎస్ పాలిసెట్ -2021 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్‌ ట్రైనింగ్ (SBTET) ఫలితాలను వెల్లడించనుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు పాలిసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://polycetts.nic.in/ లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

- ఆగస్టు 5 వ తేదీ నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

- ఆగస్టు 5 నుంచి 9 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ఉంటుంది.

- ఆగస్టు 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది.

- ఆగస్టు 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్స్ కేటాయిస్తారు.

- ఆగస్టు 14న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది.

- ఆగస్టు 23 నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరుగుతుంది.

- ఆగస్టు 24 తుది విడత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

- ఆగస్టు 24, 25 తేదీల్లో తుది విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.

- ఆగస్టు 27న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

- సెప్టెంబర్‌ 1 నుంచి పాలిటెక్నిక్‌ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.

- సెప్టెంబర్‌ 9న స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

Next Story