తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. 7,8,9,10 తరగతుల్లో ప్రవేశాల కొరకు జూన్ 5న, 6వ తరగతిలో ప్రవేశం కొరకు జూన్ 6న పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ నోటీఫికేషన్‌లో తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల జరుగుతాయని తెలిపింది. ఓసీ విద్యార్థులు రూ.150, బీసీ, ఎస్టీ, ఎస్సీలు రూ.75 దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఈనెల చివరి వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ మొదటివారంలో విడుదల చేస్తారు. మరిన్ని వివరాలు http://telanganams.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చునని తెలిపింది.
షెడ్యూల్ ఇదే..
6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు
ప్రవేశ పరీక్ష .. జూన్ 6న
7 నుంచి 10 తరగతుల్లో మిగులు సీట్లకు దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30 వరకు
ప్రవేశ పరీక్ష.. జూన్ 5
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్.. జూన్ 1 నుంచి జూన్ 6 వరకు
ఫలితాల ప్రకటన, సంబంధిత ప్రిన్సిపాళ్లకు మెరిట్ జాబితాల అందజేత.. జూన్ 14
విద్యార్థుల ఎంపిక జాబితా ఖరారు, జాయింట్ కలెక్టర్ల ఆమోదం.. జూన్ 15, 16
సంబంధిత మోడల్ స్కూళ్లలో ఎంపికైన విద్యార్థుల జాబితాల డిస్‌ప్లే.. జూన్ 17
సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాలు.. జూన్ 18 నుంచి జూన్ 20 వరకు
తరగతులు ప్రారంభం.. జూన్ 21, 2021