TS Ministers Drink Toddy. రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులు తాటికల్లు సేవించారు.
By Medi Samrat Published on 29 Jan 2021 6:27 AM GMT
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులు తాటికల్లు సేవించారు. ఈరోజు ఉదయం జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. మార్గ మధ్యంలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికుల సమస్యలను తెలుకోని సాంప్రదాయ తాటికల్లును మంత్రులు సేవించి.. తమ సంతోషాన్ని గీత కార్మికులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారని మంత్రులు అన్నారు.