తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది: మంత్రి హరీశ్‌రావు

TS Minister Harish Rao Inaugurates Development Works In Siddipet Dist. బియ్యాన్ని కొనుగోలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని

By అంజి  Published on  8 Dec 2022 9:11 AM GMT
తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది: మంత్రి హరీశ్‌రావు

బియ్యాన్ని కొనుగోలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యంలో 40 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత సామూహిక గొర్రెల షెడ్డును ప్రారంభించి అనంతరం షెడ్లలో లబ్ధిదారులకు బట్టలు పంపిణీ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నంగునూరు మండలంలో గ్రామ ప్రజల కోసం ఆస్పత్రిని తీసుకొచ్చారని గుర్తు చేశారు.

మండల కేంద్రమైన నంగునూరు నుంచి ఖాతా వరకూ డబుల్ లైన్ రోడ్డు నిర్మించామని, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఏడు చెక్ డ్యాంలతో నీటి వనరులు పెరిగాయన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని గట్లమాల్య గ్రామానికి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. ఏఎన్ ఎం సబ్ సెంటర్ లో తాత్కాలిక భవనం, శాశ్వత భవనానికి రూ.2కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ యాసంగిలో కాళేశ్వరం నీటిని తీసుకొచ్చి నంగునూరు పెద్ద వాగులో నింపుతామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును హరీశ్ రావు.. ప్రజలకు వివరించారు.

Next Story