తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు.. పరీక్ష తేదీలు ఇవే.!

TS inter exams schedule changed. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఏప్రిల్‌ 21 న జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తోంది

By అంజి  Published on  3 March 2022 7:56 AM IST
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు.. పరీక్ష తేదీలు ఇవే.!

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఏప్రిల్‌ 21 న జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తోంది ఎన్‌టీఏ. ఈ నేపథ్యంలోనే పరీక్షల షెడ్యూల్‌ను మారుస్తూ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి మే 11 వరకు జరగనున్నాయి. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 23 నుంచి మే 12 వరకు జరగనున్నాయి. అలాగే ఈ నెల 23 నుండి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఏప్రిల్‌ 11న ఎథిక్స్‌, 12న హ్యుమన్‌ వాల్యూస్‌ పరీక్షలు జరుగుతాయి.

ముందుగా రిలీజ్‌ చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 20 నుండి మే 2 వరకు, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు జరగాల్సి ఉంది. కానీ జేఈఈ పరీక్షల కారణంగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22, 25, 27, 29, మే 2, 6, 9, 11 తేదీల్లో జరగనున్నాయి. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 23, 26, 28, 30, మే 5, 7, 10, 12 తేదీల్లో జరగనున్నాయి.

Next Story