తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై హైకోర్టుకు ప్ర‌భుత్వం నివేదిక‌

TS Govt submit report on covid to high court.తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై హైకోర్టుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నివేదిక‌ స‌మ‌ర్పించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2021 8:00 AM GMT
TS HC

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై హైకోర్టుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నివేదిక స‌మ‌ర్పించింది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో పాటు క‌రోనా ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇందులో పేర్కొంది. మద్యం దుకాణాలు, పబ్‌లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని, మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారని వివ‌రించింది. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలో 23.55 ల‌క్ష‌ల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ప్ర‌భుత్వం నివేదిక‌లో పేర్కొన్న‌ది. 4.39 ల‌క్ష‌ల ఆర్టీపీసీఆర్, 19.16 ల‌క్ష‌ల ర్యాపిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది.

ఈ నెల 1 నుంచి 25వ తేదీ వ‌ర‌కు 341 మంది క‌రోనాతో మ‌ర‌ణించార‌ని, రాష్ర్టంలో క‌రోనా పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉందని వెల్ల‌డించింది. క‌రోనా ప‌రీక్ష‌ల పెంపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపింది. నిపుణుల క‌మిటీ స‌మావేశాలు ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్నాయని.. మ‌ద్యం దుకాణాలు, ప‌బ్‌లు నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పింది. నిరంత‌రం మ‌ద్యం దుకాణాల‌ను అధికారులు త‌నిఖీ చేస్తున్నారని.. రాష్ర్టానికి 430 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను కేంద్రం కేటాయించింద‌ని.. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజ‌న్‌ను చేర‌వేస్తున్నామ‌ని చెప్పింది. రెమ్‌డెసివిర్ ప‌ర్య‌వేక్ష‌ణ నోడ‌ల్ అధికారిగా ప్రీతిమీనాను నియ‌మించాం అని ప్ర‌భుత్వం నివేదిక‌లో పేర్కొంది.


Next Story