ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్‌న్యూస్

TS Govt key decision on property taxes of all municipalities. ఆస్తిపన్ను బకాయిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ

By అంజి  Published on  17 July 2022 10:36 AM GMT
ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్‌న్యూస్

ఆస్తిపన్ను బకాయిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ను రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలిక సంస్థల్లో ఈ స్కీమ్‌ను అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబరు 31తో ఈ ఓటీఎస్‌ స్కీం ముగుస్తుంది. బకాయిదారులు వెంటనే పన్ను చెల్లించి 90 శాతం వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు. 2021-22 ఏడాది వరకు ఉన్న బకాయిలను 10 శాతం వడ్డీతో ఈ స్కీమ్‌ కింద చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు.

అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జులై 16 మధ్య బకాయిలను పూర్తి వడ్డీ చెల్లించిన వారికి కూడా ఈ ఓటీఎస్‌ స్కీమ్‌ను వర్తింపజేయాలి మున్సిపల్‌ శాఖ నిర్ణయించింది. దీని ప్రకారం వడ్డీ చెల్లించిన వారికి వడ్డీలో 90 శాతం తిరిగి ఇవ్వనున్నారు. అంటే ఈ మొత్తాన్ని భవిష్యత్‌ ఆస్తిపన్నులో డిమాండ్‌లో సర్దుబాటు చేస్తారు. 2020 ఆగస్టులో కూడా ఇలాగే ఓటీఎస్‌ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో రూ.1626.83 కోట్లు బకాయిలు పేరుకపోయాయి. ఇప్పటివరకు సుమారు రూ.4కోట్ల మేర వడ్డీ బకాయిలు ఉండగా... 90శాతం వడ్డీ మాఫీ స్కీం ద్వారా రూ.3.60కోట్లు వడ్డీ మాఫీ కానుంది.

Next Story