సంక్రాంతి పండుగ రోజు టీచ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పిన సీఎం కేసీఆర్‌

TS GOVT gives green signal for teacher transfers and promotions.ఉపాధ్యాయుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంక్రాంతి

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 15 Jan 2023 3:00 PM IST

సంక్రాంతి పండుగ రోజు టీచ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉపాధ్యాయుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంక్రాంతి సంద‌ర్భంగా శుభ‌వార్త చెప్పారు. రాష్ట్రంలో టీచ‌ర్ల బ‌దిలీలు, ప‌దోన్న‌తుల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఆదివారం మంత్రి హరీష్‌ రావు, సబిత ఇంద్రారెడ్డి లు ఉపాధ్యాయ సంఘాల‌తో స‌మావేశం అయ్యారు. ఈ భేటీలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. టీచ‌ర్ల బ‌దిలీలు, ప‌దోన్న‌తుల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ఈ సంద‌ర్భంగా మంత్రులు వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు షెడ్యూల్ విడుద‌ల చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. మ‌రో రెండు లేదా మూడు రోజుల్లో టీచ‌ర్ల బ‌దిలీలు, ప‌దోన్న‌తులపై షెడ్యూల్ విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది.

Next Story