దీపావళి సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు, ఉద్యోగులకు క్లారిటీ ఇస్తూ ఈ నెల 24న (సోమవారం) సెలవు ప్రకటించింది. ఇదిలా ఉండగా 24న దీపావళి జరుపుకోవాలని అర్చకులు నిర్ణయించడంతో 25వ తేదీ నుంచి 24వ తేదీకి సెలవును మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పంచాంగాల్లోనూ పొందుపరిచామని స్పష్టం చేశారు. సాధారణంగా ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ.
క్యాలెండర్లలో అమావాస్య 25వ తేదీన ఉన్నందున, అదే రోజున పండుగ అని నమ్ముతారు. కానీ, దీపావళి 25వ తేదీ కాదు 24వ తేదీ అని అర్చకులు స్పష్టం చేస్తున్నారు. 24వ తేదీ సాయంత్రం అమావాస్యగా భావించి అదే రోజు దీపావళి నిర్వహించాలని అర్చకులు పేర్కొన్నారు. అదే రోజున ధనలక్ష్మి పూజ కూడా చేయాలని చెబుతున్నారు. తాజాగా ప్రభుత్వం ప్రకటనతో.. దీపావళి ఈ నెల 24వ తేదీనా? లేక 25వ తేదీనా? అనే సందేహాలకు తెరపడింది.