సీఎం కేసీఆర్ ఆస్ప‌త్రికి వెళ్లార‌ని తెలిసి ఆందోళ‌న చెందా

TS Governor wishes CM KCR a speedy recovery.తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిన్న‌(శుక్ర‌వారం) స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2022 10:14 AM GMT
సీఎం కేసీఆర్ ఆస్ప‌త్రికి వెళ్లార‌ని తెలిసి ఆందోళ‌న చెందా

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిన్న‌(శుక్ర‌వారం) స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. రెండు రోజులుగా నీర‌సంగా ఉండ‌డంతో పాటు ఎడ‌మ‌చేయి నొప్పిగా ఉండ‌డంతో సోమాజిగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. అన్ని ఫ‌లితాలు సాధార‌ణంగా వ‌చ్చాయ‌ని, సీఎం ఆరోగ్యం బాగుంద‌ని.. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రికి పుష్ప‌గుచ్ఛం, లేఖ‌ను పంపిచారు. 'సీఎం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. చిన్నపాటి అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యాను' అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై తెలిపారు.

Next Story
Share it