తెలంగాణ రాష్ట్రంలో 19మంది డిఎస్పీల బ‌దిలీ

TS Government Transfer 19 DSPS.తెలంగాణ రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతోంది. రాష్ట్రంలో 19 మంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2021 1:54 PM IST
తెలంగాణ రాష్ట్రంలో 19మంది డిఎస్పీల బ‌దిలీ

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతోంది. రాష్ట్రంలో 19 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పోస్టింగ్‌ కోసం వెయింగ్‌లో ఉన్న జీ హనుమంత రావును కూకట్‌పల్లి ట్రాఫిక్‌ ఏసీపీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ ట్రాఫిక్‌ ఏసీపీగా ఉన్న ఏ చంద్రశేఖర్‌ను కూకట్‌పల్లి ఏసీపీగా నియమించారు.

కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న బీ సురేందర్‌ రావును సైబరాబాద్‌ ఏసీపీ, ఎస్బీగా బదిలీ చేశారు. ఇబ్రహింపట్నం ఏసీపీగా ఉన్న వై యాదగిరి రెడ్డిని రాచకొండ సీపీ ఆఫీస్‌లో, జగిత్యాల ఎస్డీపీఓగా ఉన్న పీ వెంకటరణ, చౌటుప్పల్‌ ఏసీపీగా ఉన్న పీ సత్తయ్య, గద్వాల డీఎస్పీ ఏ యాదగిరిని చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

ఏ అనిల్‌ కుమార్‌- కాగజ్‌నగర్‌ ఎస్డీపీఓ

కే బాల కృష్ణా రెడ్డి- ఇబ్రహింపట్నం ఏసీపీ

మాదాత రమేష్‌- గజ్వేల్‌ ఏసీపీ

ఆర్‌ శ్రీనివాస్‌- ఆసిఫాబాద్‌ ఎస్డీపీఓ

రత్నాపురం ప్రకాశ్‌- జగిత్యాల ఎస్డీపీఓ

ఆర్‌ సతీశ్‌ కుమార్‌- గోషామహల్‌ ఏసీపీ

ఎన్‌ ఉదయ్‌ రెడ్డి- చౌటుప్పల్‌ ఏసీపీ

సాయి రెడ్డి వెంకట్‌ రెడ్డి- భువనగిరి ఏసీపీ

వాసాల సత్తయ్య- హుస్నాబాద్‌ ఏసీపీ

ఎన్సీ రంగస్వామి- గద్వాల్‌ డీఎస్పీ

కే సైదులు- మెదక్‌ ఎస్డీపీఓ

Next Story