టీకా తీసుకోకుంటే.. రేషన్, పెన్షన్ బంద్..?
TS government key orders over vaccination.కరోనా మహమ్మారి నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు
By తోట వంశీ కుమార్ Published on 26 Oct 2021 6:20 AM GMTకరోనా మహమ్మారి నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. అయితే.. ఇప్పటికి కొద్ది మంది వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కొందరు ఫస్ట్ డోసు తీసుకున్నా రెండో డోసు తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ వార్త సారాంశం ప్రకారం.. టీకా తీసుకోని వారికి రేషన్, పెన్షన్ కట్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారట. నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వంద కోట్లకు చేరిందని.. తెలంగాణలో కూడా రెండు కోట్ల డోసులుకు దగ్గరగా ఉందని.. అయితే.. 60లక్షలకు పైగా ప్రజలు ఒక్క డోసు కూడా కోలేదని.. వారి కోసమే ఈ కొత్త నిబంధనలు తీసుకువస్తున్నారట. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో దాదాపుగా అందరూ ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోనివారే ఉన్నారన్నారు.
సోమవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో 179 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. 104 మంది బాధితులు కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,453కు చేరగా.. ఇందులో 6,62,481 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా 3,949మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి.