తెలంగాణలో ఈసెట్ 2021 ఫలితాలు విడుదల
TS ECET 2021 Results Out.తెలంగాణలో ఈసెట్(ECET) ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్ చదివిన
By తోట వంశీ కుమార్ Published on 18 Aug 2021 6:34 AM GMTతెలంగాణలో ఈసెట్(ECET) ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు రాసిన ఈ సెట్ ఫలితాలను బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ నెల 3న జరిగిన పరీక్షకు 24 వేల మంది విద్యార్థులు హాజరు అవ్వగా.. 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. ఫలితాల కోసం అభ్యర్థులు https://ecet.tsche.ac.in, https://tsecet.nic.in/ వెబ్‌సైట్ లలో సందర్శించవచ్చు. కాగా.. ఈ నెల 24 నుంచి ఈ సెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 24వ తేదీ నుంచి 28 వరక స్లాట్ బుకింగ్, 26వ తేదీ నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 02వ తేదీన ఈసెట్ అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 13వ తేదీన ఈసెట్ తుది విడతల ప్రవేశాల షెడ్యూల్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 14వ తేదీన తుది విడత ధృవపత్రాల పరిశీలిస్తారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో వెబ్ ఆఫ్షన్లకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబర్ 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 18న స్పాట్ ప్రవేశాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తారు.