తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..

TS Corona health bulletin I తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,015 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  12 Nov 2020 3:51 AM GMT
తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,015 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,54,666 పాజటివ్‌ కేసులు నమోదు కాగా, 1,393 మంది మృతి చెందారు.

తాజాగా ఇక కరోనా నుంచి కోలుకుని 1,716 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,35,950కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,323 యాక్టివ్‌ కేసులుండగా, గడిచిన 24 గంటల్లో 40,70,004కు చేరింది.తా

ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీలో 172, కొత్తగూడెం 80, జగిత్యాల 18, జనగాం 12, భూపాలపల్లి 11, గద్వాల 10, కామారెడ్డి 13, కరీంనగర్‌ 46, ఖమ్మం 48, అసిఫాబాద్‌ 5, మహబూబ్‌నగర్‌ 14,మహబూబాబాద్‌ 14, మంచిర్యాల 25, మెదక్‌ 12,మేడ్చల్‌ మల్కాజిగిరి 97, ములుగు 12, నాగర్‌ కర్నూలు 21, యాదాద్రి 13, వరంగల్‌ అర్బన్‌ 41,వరంగల్‌ రూరల్‌ 14, సూర్యాపేట 21, వికరాబాద్‌ 14, సంగారెడ్డి 42, సిద్దిపేట 15, రాజన్న సిరిసిల్ల 16, రంగారెడ్డి 98, పెద్దపల్లి 17, నిజామాబాద్‌ 25, నిర్మల్‌ 15, నారాయణపేట 2, నల్గొండ 57 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Next Story