తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 948 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,7776 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 1,415 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కరోనా నుంచి 1,607 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,45,293కు చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, ఇదే దేశంలో 1.5 ఉంది. రికవరీ రేటు రాష్ట్రంలో 94.42 శాతం ఉండగా, దేశంలో 93,5 శాతం ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 13,068 ఉండగా, హోం ఐసోలేషన్లో 10,710 ఉన్నారు.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.