తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 997 పాజిటివ్ కేసులు నమోదు కాగా,నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,55,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1397 మంది మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,094 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 14,466 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక తాజాగా కరోనా నుంచి 1,222 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,37,172కు చేరింది.
అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.54 ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రికవరీ రేటు రాష్ట్రంలో 92.76 ఉండగా, దేశంలో 92.9 శాతం ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో 169 నమోదు కాగా, ఇతర జిల్లాల్లో పదుల సంఖ్యలో నమోదయ్యాయి.