తెలంగాణలో పాజిటివ్‌ కేసులకంటే రికవరీ ఎక్కువ... తాజాగా ఎన్ని కేసులంటే

TS corona cases 1058 .. తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1058 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,

By సుభాష్  Published on  19 Nov 2020 3:36 AM GMT
తెలంగాణలో పాజిటివ్‌ కేసులకంటే రికవరీ ఎక్కువ... తాజాగా ఎన్ని కేసులంటే

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1058 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,60,834 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1419 మంది మృతి చెందారు. తాజాగా 1,440 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,46,733 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, దేశంలో 1.5శాతం ఉంది. ఇక రికవరీ రాష్ట్రంలో 94.59 శాతం ఉండగా, దేశంలో 93.6 శాతం ఉంది. మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,682 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 10,352 మంది చికిత్స పొందుతున్నారు.

తాజాగా జీహెచ్‌ఎంసీలో 168 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story
Share it