ఆ ఓట్లు కూడా మనవే.. నల్గొండలో ప్రగతి పరుగులు తీయాలి: సీఎం కేసీఆర్

TS CM KCR Orders Ministers on Nalgonda District Development. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రగతి పరుగులు తీయాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఉమ్మడి నల్గొండ

By అంజి  Published on  8 Nov 2022 4:17 AM GMT
ఆ ఓట్లు కూడా మనవే.. నల్గొండలో ప్రగతి పరుగులు తీయాలి: సీఎం కేసీఆర్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రగతి పరుగులు తీయాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను తమకు కంచుకోటగా మార్చిన ప్రజలకు టీఆర్‌ఎస్‌ రుణపడి ఉంటుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధిని స్వయంగా తానే పర్యవేక్షిస్తానని సీఎం తెలిపారు. ఏడు రోజుల్లోగా పురపాలక, పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు మునుగోడును సందర్శించాలని, అక్కడే ఉమ్మడి జిల్లా సమీక్ష ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు.

అభివృద్ధి పనులను వెంటనే నిర్ణయించి టెండర్లు పిలవాలని, నెల రోజుల్లోపు ప్రారంభించాలని సూచించారు. రోడ్లతో పాటు గ్రామాలు, పట్టణాలు, తండాల్లో ఉన్న సమస్యలన్నీంటిని పరిష్కరించాలన్నారు. మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్లాన్లను రెడీ చేసుకోవాలని మంత్రి జగదీశ్​రెడ్డికి సూచించారు. పాత ఎమ్మెల్యేకు.. ప్రస్తుత తాజా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డికి మధ్య పనుల్లో తేడా కనిపించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రులకు కేసీఆర్‌ సూచించారు.

మునుగోడు బైపోల్‌లో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, పలువురు నేతలు.. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా కూసుకుంట్లను కేసీఆర్‌ సత్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు. టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో అభ్యర్థిని గెలిపించారన్నారు. ఎన్నికల్లో మెజారిటీ 10 వేల ఓట్లే అని అసంతృప్తి చెందవద్దన్నారు. రోడ్డు రోలర్, రోటీ మేకర్​ తదితర గుర్తులకు వచ్చిన దాదాపు 7 వేల ఓట్లు కూడా మనవేనని కేసీఆర్ అన్నారు.

Next Story