8న తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

TS Cabinet meeting on june 8th.తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జూన్ 8న కేబినెట్ భేటీ కానుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2021 5:14 PM IST
8న తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జూన్ 8న కేబినెట్ భేటీ కానుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ భేటీలో వివిధ కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్రంలో కరోనా స్థితిగతులు, వైద్యం, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో నీటిపారుద‌ల ప్రాజెక్టుల ప‌నుల పురోగ‌తి, చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు, సాగునీరుత‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించే వీలుంది.

వానాకాలం పంటల సాగుకు రైతుబంధు విడుదల, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, విత్తనాలు, ఎరువుల లభ్యత తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. థర్డ్ వేవ్ రానుందనే హెచ్చరికల నేపథ్యంలో మూడో వేవ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై లాక్‌డౌన్‌ ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

ఇక జూన్‌7 న‌(సోమ‌వారం) 19 జిల్లాలో ప్రారంభం కావాల్సిన 19 డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ల‌ను జూన్ 9 నుంచి ప్రారంభించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులంతా పాల్గొని ఏక‌కాలంలో 19 సెంట‌ర్ల‌ను ప్రారంభించాల‌నీ కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు లేని చోట ఇత‌ర ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి వారి చేతుల మీదుగా ప్రారంభోత్స‌వాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయంపైనా మంత్రి మండలి చర్చించే అవకాశముంది.

Next Story