Telangana: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టిక్కెట్లు విడుదల

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మే 24 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షల హాల్ టిక్కెట్‌లను విడుదల చేసింది.

By అంజి  Published on  17 May 2024 9:15 PM IST
TS BIE, hall tickets, intermediate, supplementary exams

Telangana: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టిక్కెట్లు విడుదల

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మే 24 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షల హాల్ టిక్కెట్‌లను శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాళ్లు బోర్డు వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ నుండి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో సూచించిన ఫోటో, సంతకం, పేరు, మాధ్యమం, సబ్జెక్ట్‌లు తదితరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు.

ఏదైనా తేడాలు కనిపిస్తే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లేదా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దాలి. ప్రిన్సిపాల్ సంతకం లేకుండా కూడా డౌన్‌లోడ్ చేసిన హాల్ టిక్కెట్‌లతో అభ్యర్థులను పరీక్షలకు అనుమతించాలని థియరీ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

Next Story