అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్
TS Assembly speaker Pocharam Srinivas Reddy tests positive.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా
By తోట వంశీ కుమార్ Published on
25 Nov 2021 6:06 AM GMT

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. రెగ్యులర్ మెడికల్ టెస్టుల్లో భాగంగా నిన్న రాత్రి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. ఇక గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు.
కాగా.. ఈ నెల 21న పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి వివాహం జరిగింది. ఈ వివాహనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ క్రమంలో వారు పక్క పక్కనే కూర్చుని స్పీకర్‌తో మాట్లాడారు. సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఈ వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే.
Next Story