అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజయ్.. నెటిజన్ల ట్రోలింగ్

TRS trolling by saying Sanjay is a cart carrying Amit Shah's sandals. మునుగోడు పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. సికింద్రాబాద్‌ ఉజ్జయిని

By అంజి  Published on  22 Aug 2022 5:47 AM GMT
అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజయ్.. నెటిజన్ల ట్రోలింగ్

మునుగోడు పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత అమిత్‌ షా బయటకు వచ్చారు. అదే సమయంలో ఆయన వెంటనే ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. అమిత్‌ షా కంటే ముందు నడిచి, ఆయన చెప్పులు తీసి ఇచ్చారు. దీంతో బండి సంజయ్ చేసిన పని చూసి అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు నెట్టింట బండి సంజయ్‌ని ట్రోల్‌ చేస్తున్నారు.

దీని టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌.. ''గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా..?'' అంటూ పోస్టు చేశారు. దీంతో ఇతరులు ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో షేర్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. ఎందుకింత బానిసత్వం? అంటూ బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన మంత్రి కేటీఆర్.. స్వయంగా దీన్ని రీట్వీట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సైతం స్పందించారు. బండి సంజయ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ ఆయన వీడియో విడుదల చేశారు.

"ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను (బండి సంజయ్​ని ఉద్దేశిస్తూ), ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడిని (కేసీఆర్​ను ఉద్దేశిస్తూ) తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉంది" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి తనపై టీఆర్ఎస్ కార్యకర్తలు, నెటిజన్లు చేస్తున్న విమర్శలపై బండి సంజయ్‌ ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది.



Next Story