తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేశారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 23న స్క్రూటినీ, 24న నామినేషన్ల ఉపసంహరణ, 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. అధ్యక్షుడి ఎన్నిక అనంతరం ప్లీనరిని నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లు స్వీకరించనున్నారు.
కేసీఆర్ తరుపున మంత్రుల నామినేషన్..
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో.. సీఎం కేసీఆర్ తరుపున మంత్రులు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీలు పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను మంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించగా.. మిగిలిన మంత్రులు బలపరిచారు.