టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

TRS Candidates confirmed for MLC Elections.ఎట్ట‌కేల‌కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను తెలంగాణ రాష్ట్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2021 6:29 AM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

ఎట్ట‌కేల‌కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్) పార్టీ ఖ‌రారు చేసింది. త‌క్కెళ్లప‌ల్లి రవీందర్‌రావు, సిద్దిపేట మాజీ క‌లెక్ట‌ర్ వెంకట్రామిరెడ్డి, మాజీ ఉప ముఖ్య‌మంత్రి కడియం శ్రీహరి, శాస‌న మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల‌ను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. కాగా.. నామినేష‌న్ల‌కు నేడే ఆఖ‌రి రోజు కావ‌డంతో వీరంతా నేడు నామినేష‌న్ల‌ను వేయ‌నున్నారు. వీరి ఎన్నిక ఏక‌గ్రీవం అయ్యే అవ‌కాశం ఉంది.

ఇక నామినేషన్ దాఖలుకు చివరిరోజు కావడంతో తెలంగాణ అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లతో హడావుడిగా క‌నిపిస్తోంది. ఇక నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేసేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులందరూ కూడా అసెంబ్లీ సెక్రెటరీ ఛాంబర్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఈ నెల 29న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Next Story
Share it